: 300 మంది ఐసిస్ తీవ్రవాదులను మట్టుబెట్టిన రష్యా


సిరియాలో 300 మంది తీవ్రవాదులను తమ వైమానిక దళాలు మట్టుబెట్టినట్టు రష్యా ప్రకటించింది. గడిచిన 24 గంటల్లో ఐఎస్ఐఎస్ తీవ్రవాదులకు చెందిన 60 స్ధావరాలపై వైమానిక దాడులు చేశామని రష్యా రక్షణ మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ఈ దాడుల్లో సుమారు 300 మంది ఐసిస్ తీవ్రవాదులు హతమయ్యారని ఆ శాఖ స్పష్టం చేసింది. రోజూ పది ప్రాంతాలను లక్ష్యం చేసుకుని వైమానిక దాడులు నిర్వహిస్తున్నామని, ఇకపై వాటి తీవ్రతను పెంచుతామని రష్యా తెలిపింది. కాగా, సిరియా సైనికులకు రక్షణగా, వారి సహకారంతో రష్యా ఐసిస్ తీవ్రవాదులపై గత పది రోజులుగా విరుచుకుపడుతోంది. ఇంతవరకు ప్రజలను, ప్రత్యర్థులను అపహరించి, అత్యాచారాలు, హత్యలతో అత్యంత కిరాతకంగా మట్టుబెట్టిన ఐసిస్ తీవ్రవాదులు ఇప్పుడు రష్యా బలగాల చేతుల్లో లెక్కకు మిక్కిలిగా నష్టపోతున్నారు. తాజా దాడులతో తలదాచుకునేందుకు తెగఇబ్బంది పడుతున్నారని సమాచారం.

  • Loading...

More Telugu News