: ఎమర్జెన్సీ సమయంలో జైలుకు వెళ్లిన వారిని సన్మానించనున్న మోదీ
ఎమర్జెన్సీ సమయంలో జైలుకు వెళ్లిన వివిధ వర్గాల ప్రముఖులకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సన్మానం చేయనున్నారు. రేపు లోక్ నాయక్ జయప్రకాశ్ నారాయణ్ జయంతి సందర్భంగా వారికి సన్మానం జరగనుంది. 'లోక్ తంత్ర కే ప్రహరి' పేరిట నిర్వహించనున్న ఈ కార్యక్రమంలో బీజేపీ అగ్రనేత ఎల్ కే అద్వానీ, పంజాబ్ సీఎం ప్రకాశ్ సింగ్ బాదల్ తదితరులు పాల్గొననున్నారు. బీహార్ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో జేడీయూ, ఆర్జేడీ, కాంగ్రెస్ పార్టీలను ఈ కార్యక్రమం ఇరుకున పెడుతుందని అంటున్నారు.