: మాల, మాదిగలను విడదీయడానికి కుట్రలు పన్నుతున్నారు: స్వర్ణ వెంకయ్య
'ఎస్సీ వర్గీకరణ వద్దు, దళితుల ఐక్యతే ముద్దు' అనే అంశంపై నెల్లూరులో సదస్సు జరిగింది. మాల మహానాడు ఈ సదస్సును నిర్వహించింది. ఈ కార్యక్రమానికి మాలమహానాడు రాష్ట్ర ఉపాధ్యక్షుడు స్వర్ణ వెంకయ్య ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, మాల, మాదిగలను విడదీయడానికి కొన్ని శక్తులు కుట్రలు పన్నుతున్నాయని అన్నారు. కొందరి మాటలు విని మోసపోవద్దని సూచించారు. ఎస్సీలంతా ఐక్యంగా ఉండటం దళిత జాతికి ఎంతో అవసరం అని చెప్పారు.