: గెలుపే లక్ష్యం...వన్డే సిరీస్ పెను సవాలే: డివిలియర్స్


విజయమే లక్ష్యంగా వన్డే సిరీస్ ను ప్రారంభించనున్నామని సౌతాఫ్రికా వన్డే జట్టు కెప్టెన్ డివిలియర్స్ తెలిపాడు. కాన్పూర్ లో డివిలియర్స్ మాట్లాడుతూ, టీ20 సిరీస్ తమ ఆటగాళ్లలో ఆత్మవిశ్వాసాన్ని పెంచిందని అన్నాడు. అయితే భారత్ తో అసలైన పోరాటం రేపటి నుంచి ప్రారంభం కానుందని ఆయన అభిప్రాయపడ్డాడు. పటిష్ఠమైన భారత్ ను భారత్ లో ఢీకొట్టడం సవాలేనని అన్నాడు. వన్డే రూపంలో వివిధ రకాలైన వికెట్లపై, వివిధ రకాలైన వాతావరణ పరిస్థితుల్లో భారత్ ను ఎదుర్కోవడం తమ ఆటగాళ్లకు సిసలైన పరీక్షలాంటిదని డివిలియర్స్ పేర్కొన్నాడు. టీ20 సిరీస్ కోల్పోయిన భారత్ మరింత కసిగా ఆడుతుందని అభిప్రాయపడ్డాడు. భారత్ విజయాన్ని అడ్డుకునేందుకు సర్వ శక్తులూ ఒడ్డుతామని ఆయన తెలిపాడు. అయితే తమకు గెలుపంటేనే ఇష్టమని, గెలుపుకోసం వంద శాతం కష్టపడతామని డివిలియర్స్ చెప్పాడు.

  • Loading...

More Telugu News