: నేపాల్ ప్రధాని రాజీనామా
నేపాల్ ప్రధానమంత్రి సుశీల్ కుమార్ కొయిరాలా ఈ రోజు తన పదవికి రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను రాష్ట్రపతి రాంబరణ్ యాదవ్ కు అందజేశారు. రాజీనామాను రాష్ట్రపతి ఆమోదించారు. అయితే, తదుపరి ప్రభుత్వం ఏర్పాటయ్యే వరకు అపద్ధర్మ ప్రధానిగా కొనసాగాలని కొయిరాలాను రాష్ట్రపతి కోరారు. రేపు కొత్త ప్రధానిని ఎన్నుకోనున్నారు. మరోవైపు, రేపు పార్లమెంటులో జరగబోయే నూతన ప్రధాని ఎన్నికలో కొయిరాలా మళ్లీ బరిలో నిలిచారు. ఈ మేరకు ఆయన నామినేషన్ కూడా దాఖలు చేశారు.