: తెలంగాణలో సత్ప్రవర్తన కలిగిన ఖైదీల విడుదలకు మార్గం సుగమం
తెలంగాణ జైళ్లలో సత్ప్రవర్తన కలిగిన ఖైదీల విడుదలకు మార్గం సుగమమైంది. చర్లపల్లి కేంద్ర కారాగారంలో ఇవాళ స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జైళ్ల శాఖ డీఐజీ నర్సింహరావు, చర్లపల్లి సూపరింటెండెంట్ వెంకటేశ్వర్ రెడ్డి, సిబ్బంది, ఖైదీలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా డీఐజీ మాట్లాడుతూ, అర్హులైన ఖైదీలను త్వరలోనే క్షమాభిక్ష కింద విడుదల చేయనున్నట్టు తెలిపారు. ఖైదీల క్షమాభిక్ష కోసం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కమిటీ ఏర్పాటు చేసింది. 2 నెలల్లో ఈ కమిటీ ఖైదీలకు సంబంధించి నివేదిక ఇవ్వనుంది.