: హంద్రీనీవాను పూర్తి చేసి అనంత జిల్లాకు నీరందిస్తాం: బాలకృష్ణ


అనంతపురం జిల్లాలోని తన నియోజకవర్గం హిందూపురంలో ఎమ్మెల్యే, సినీ నటుడు బాలకృష్ణ ఇవాళ పర్యటించారు. పట్టణంలోని చలివెందుల వద్ద నిర్మిస్తున్న హంద్రీనీవా ప్రాజెక్టు పనులను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ, హంద్రీనీవా ప్రాజెక్టు ఎన్టీఆర్ మానసపుత్రిక అని పేర్కొన్నారు. జవనరిలోగా ప్రాజెక్టును పూర్తి చేసి కరవుతో అల్లాడుతున్న జిల్లా వాసులకు నీరందిస్తామని స్పష్టంగా చెప్పారు. తరువాత పట్టణంలోని బిట్ ఇంజినీరింగ్ కళాశాలకు వెళ్లి అక్కడ స్వామి వివేకానంద విగ్రహాన్ని బాలయ్య ఆవిష్కరించారు.

  • Loading...

More Telugu News