: పలువురు ఉద్యోగులకు ట్విట్టర్ ఉద్వాసన పలకనుందా?
ప్రముఖ సోషల్ నెట్ వర్కింగ్ సంస్థ ట్విట్టర్ తన ఉద్యోగుల్లో కొంత మందికి ఉద్వాసన పలకనుందా? అంటే ఉద్యోగులు అవుననే అంటున్నారు. ఉద్యోగుల ఉద్వాసనపై ఈపాటికే సీఈవో జాకీ డోస్రే నిర్ణయం తీసుకున్నారని చెబుతున్నారు. దీంతో మరో రెండు వారాల్లో చాలా మంది ఉద్యోగులను విధుల నుంచి తొలగించనున్నారని మీడియా వార్తా కథనాలు ప్రసారం చేస్తోంది. ప్రపంచ వ్యాప్తంగా ట్విట్టర్ కు వున్న 35 కార్యాలయాల్లో సుమారు 4100 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. అయితే, వీరిలో ఎంతమందిని తొలగిస్తారన్న విషయంపై స్పష్టత లేదు. ఇదిలా ఉంచితే, దీనిపై ట్విట్టర్ స్పందిస్తూ, ఆ వార్తలన్నీ ఊహాజనితమని తెలిపింది. ఆ వార్తల్లో ఎలాంటి వాస్తవం లేదని...తాము ఎవరినీ తొలగించడం లేదని ట్విట్టర్ వెల్లడించింది.