: టర్కీ రాజధాని అంకారాలో జంట పేలుళ్లు... 20 మంది దుర్మరణం
టర్కీ రాజధాని అంకారాలో కొద్దిసేపటి క్రితం జంట పేలుళ్లు సంభవించాయి. నగరంలో శాంతి ర్యాలీ నిర్వహిస్తున్న సమయంలోనే బాంబు పేలుడు సంభవించడంతో అక్కడ కలకలం రేగింది. నగరంలోని అంకారా సెంట్రల్ రైల్వే స్టేషన్ సమీపంలోని ప్రధాన కూడలి వద్ద జరిగిన ఈ పేలుళ్లలో 20 మంది చనిపోయినట్లు స్ధానిక మీడియా సంస్థ ‘డోగన్ న్యూస్ ఏజెన్సీ’ వెల్లడించింది. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. దేశంలో కుర్దూ మిలిటెంట్లకు, ప్రభుత్వ బలగాలకు మధ్య జరుగుతున్న ఘర్షణలను వ్యతిరేకిస్తూ శాంతి ర్యాలీ నిర్వహిస్తుండగా ఈ పేలుళ్లు జరగడం గమనార్హం.