: 19 ఏళ్ల తర్వాత సిద్ధూను కలసిన అజారుద్దీన్
ఢిల్లీలోని ఇంద్రప్రస్థ అపోలో ఆసుపత్రిలో డీప్ వీన్ త్రోంబోసిస్ వ్యాధికి చికిత్స చేయించుకుంటున్న మాజీ క్రికెటర్ నవజ్యోత్ సింగ్ సిద్ధూను మాజీ కెప్టెన్ అజారుద్దీన్ సర్ ప్రైజ్ విజిట్ తో ఆశ్చర్యపరిచాడు. ఆసుపత్రికి వెళ్లిన అజ్జుభాయ్ 'నా సోదరుడు హాస్పిటల్ లో ఉన్నాడు, చూడాలి' అంటూ అక్కడున్న హాస్పిటల్ స్టాఫ్ కు ఆశ్చర్యాన్ని కలిగించాడు. దాదాపు 19 ఏళ్ల తర్వాత సిద్ధూ, అజార్ కలుసుకున్నారు. 1996 లో ఇంగ్లాడ్ టూర్ కు వెళ్లిన సందర్భంగా ఓ మ్యాచ్ లో వీరిద్దరి మధ్య అభిప్రాయభేదాలు బహిర్గతమయ్యాయి. అప్పటి కెప్టెన్ అజారుద్దీన్ శైలిని నిరసిస్తూ సిద్ధూ సిరీస్ ను వాకౌట్ చేశాడు. అలాంటి అజార్ తనను వెతుక్కుంటూ రావడంతో హాస్పిటల్ బెడ్ మీద ఉన్న సిద్ధూ సంతోషాన్ని పట్టలేకపోయాడు. అజార్ తో సెల్ఫీ దిగి ట్విట్టర్ లో పోస్ట్ చేశాడు. అంతే కాకుండా... పాత బంగారం, పాత వైన్, పాత స్నేహితులు ఇప్పటికీ అపురూపమే అంటూ కామెంట్ చేశాడు.