: మీ కోసం నిరంతరం పోరాడుతున్నాడు... నా బిడ్డను ఆశీర్వదించండి: వైయస్ విజయమ్మ


ప్రత్యేక హోదా వస్తేనే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని వైకాపా గౌరవ అధ్యక్షురాలు, జగన్ తల్లి వైయస్ విజయమ్మ అన్నారు. రాష్ట్ర విభజన సమయంలో ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామని అప్పటి ప్రధాని మన్మోహన్ సింగ్ హామీ ఇచ్చారని... ప్రత్యేక హోదా 10 సంవత్సరాల పాటు కావాలని వెంకయ్యనాయుడు కూడా కోరారని గుర్తు చేశారు. పార్లమెంటులో ఇచ్చిన హామీలకే దిక్కులేకపోతే ఎలాగని ప్రశ్నించారు. ప్రత్యేక హోదా ఆంధ్రప్రదేశ్ హక్కు అని చెప్పారు. ఎన్నికల హామీలను చంద్రబాబు విస్మరించారని... ప్రత్యేక హోదా కోసం చంద్రబాబు ఎందుకు పోరాడటం లేదని మండిపడ్డారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని స్థాపించినప్పుడు నా కుమారుడిని మీ చేతుల్లో పెడుతున్నానని చెప్పానని గుర్తు చేశారు. ఇప్పుడు మీ కోసమే జగన్ నిరవధిక నిరాహార దీక్ష చేస్తున్నారని... తన బిడ్డను ఆశీర్వదించాలని ప్రజలను కోరారు.

  • Loading...

More Telugu News