: హైదరాబాద్ లో బీజేపీ కార్యకర్తలపై కత్తితో దాడి


హైదరాబాద్ లో బీజేపీ కార్యకర్తలపై ఓ దుకాణం యజమాని కత్తితో దాడి చేసిన ఘటన చోటు చేసుకుంది. ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా విపక్ష పార్టీలు నిర్వహిస్తున్న బంద్ లో భాగంగా నగరంలోని ఎన్టీఆర్ నగర్ లో బీజేపీ కార్యకర్తలు షాపులు మూయిస్తున్నారు. ఈ సమయంలో ఓ షాపు యజమాని అనూహ్యంగా కార్యకర్తలపై కత్తితో దాడి చేశాడు. ఈ సమయంలో ఇద్దరికి గాయాలయ్యాయి. దాంతో ఆగ్రహించిన కార్యకర్తలు తిరిగి యజమానిపై దాడికి పాల్పడ్డారు.

  • Loading...

More Telugu News