: మావోల పేరుతో విశాఖలో అంతర్ రాష్ట్ర దొంగల ముఠా వసూళ్లు... అరెస్ట్
మావోయిస్టుల పేరుతో బెదిరింపులు, బలవంతంగా డబ్బులు వసూలు చేస్తున్న ఘటనలు విశాఖలో ఈ మధ్య తరచుగా జరుగుతున్నాయి. తాజాగా అలాంటి ఘటనలకు పాల్పడ్డుతున్న ఏడుగురు అంతర్ రాష్ట్ర దొంగల ముఠాను పోలీసులు అరెస్టు చేశారు. నగరంలోని పెద్దవాల్తేరు ప్రధాన రహదారిపై తనిఖీలు చేస్తున్న సమయంలో అనుమానాస్పదంగా కనిపించడంతో వారిని అదుపులోకి తీసుకున్నారు. రెండు తుపాకులు, రూ.2 లక్షల నగదు, రెండు కార్లను వారి నుంచి స్వాధీనం చేసుకున్నారు. తరువాత వారిని విచారించగా పోలీసుల పేరుతో వసూళ్లు చేస్తున్నట్టు తెలిసింది. ఈ దొంగల ముఠా 5 జిల్లాల పరిధిలో మొత్తం 19 చోట్ల నేరాలకు పాల్పడినట్టు పోలీసులు తెలిపారు.