: హైదరాబాద్ లో సిటీ బస్సులపై రాళ్లు విసిరిన ఆందోళనకారులు
రైతు సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ అఖిలపక్షాలు నిర్వహిస్తున్న తెలంగాణ బంద్ నేపథ్యంలో హైదరాబాద్ లో స్వల్ప ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నాయి. నగరంలోని అన్ని డిపోల వద్ద శాంతియుతంగా నిరసనలు తెలుపుతున్న అఖిలపక్షాల నేతలను పోలీసులు అరెస్టు చేసి పోలీస్ స్టేషన్ లకు తరలించారు. ఈ క్రమంలో ఇటు అబిడ్స్ జీపీఓ వద్ద రెండు సిటీ బస్సులపై కొందరు ఆందోళనకారులు రాళ్లు విసిరారు. దాంతో బస్సుల అద్దాలు పగలిపోయాయి. ఎవరికీ గాయాలు కాలేదు. నాంపల్లిలో కూడా కొందరు ఆందోళనకారులు ఆర్టీసీ బస్సులపై రాళ్లు రువ్వడంతో అద్దాలు పగిలిపోయాయి.