: ఏయూ అలుమ్నికి శరవేగంగా ఏర్పాట్లు... ముఖ్య అతిథులు వీరే


విశాఖలోని ఆంధ్ర యూనివర్శిటీ అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించనున్న అలుమ్ని-2015కు ఏర్పాట్లన్నీ శరవేగంగా జరుగుతున్నాయి. ఈ కార్యక్రమానికి ప్రముఖులు, ఉన్నతాధికారులు విచ్చేయనుండటంతో సమావేశ ప్రాంగణాన్ని, వేదికను సుందరంగా ముస్తాబు చేస్తున్నారు. గత రెండు రోజులుగా సీఆర్ రెడ్డి స్నాతకోత్సవ మందిరంలో భారీ ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఏయూ రెక్టార్ ఇ.ఎ.నారాయణ, రిజిస్ట్రార్ ఉమామహేశ్వరరావు ఏర్పాట్లను స్వయంగా పరిశీలిస్తున్నారు. మరోవైపు, స్నాతకోత్సవ మందిరం పరిసరాల్లో విద్యార్థులు స్వచ్ఛభారత్ కార్యక్రమం చేపట్టి, పరిశుభ్రం చేశారు. దీంతోపాటు రెక్టార్, రిజిస్ట్రార్ లు ఆహ్వాన కమిటీ, రవాణా కమిటీ, వసతి సదుపాయాల కమిటీల ప్రతినిధులతో సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఈ సాయంత్రం విశాఖ ఆర్కే బీచ్ లో విద్యార్థులు భారీ ర్యాలీ నిర్వహించబోతున్నారు. 12వ తేదీన జరుగుతున్న ఏయూ పూర్వ విద్యార్థుల అపూర్వ సమ్మేళనానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ముఖ్య అతిథిగా హాజరవుతున్నారు. కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు, రాష్ట్రమంత్రులు గంటా శ్రీనివాసరావు, రావెల కిషోర్ బాబులతో పాటు ఎంపీలు కె.హరిబాబు, ఎం.శ్రీనివాసరావులు విచ్చేస్తున్నారు. వీరితో పాటు ఎమ్మెల్యేలు వి.ఆర్.కె.బాబు, గణేష్ కుమార్, పి.శ్రీనివాస్, విష్ణు కుమార్ రాజు, పి.జి.వి.ఆర్.నాయుడులు ఈ కార్యక్రమానికి తరలివస్తున్నారు. Visit: www.aualumni.in

  • Loading...

More Telugu News