: పారదర్శకత లోపంతో బ్లాక్ లిస్టులో పలు చైనా కంపెనీలు

చైనాలోని 3.14 మిలియన్ల(31.4 లక్షల) సంస్థలు బ్లాక్ లిస్టులో చేరాయి. ఈ సంస్థల్లో పారదర్శకత లోపించినట్టు భావించిన ఆ దేశ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. సదరు సంస్థలు ప్రభుత్వానికి అందించిన వివరాలు, నిర్వహణ లోపాలు, పన్నుల ఎగవేత తదితర అంశాలను దృష్టిలో ఉంచుకునే ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందని అధికారులు తెలిపారు. ఈ బ్లాక్ లిస్ట్ లో కంపెనీల వివరాలను 'నేషనల్ ఎంటర్ ప్రైజెస్ క్రెడిట్ ఇన్ఫర్మేషన్ పబ్లిసిటీ సిస్టమ్' అనే వెబ్ సైట్ లో ఉంచినట్టు పారిశ్రామిక, వాణిజ్య శాఖల డిప్యూటీ చీఫ్ లీయు యుటింగ్ వివరించారు. ఆ కంపెనీల రిజిస్ట్రేషన్ వ్యవహారాలు, ప్రభుత్వ పన్నులు, జరిమానాలు లాంటి పూర్తి వివరాలను వెబ్ సైట్ సిస్టమ్ అందిస్తున్నట్టు తెలిపారు.