: టీ20ల్లో కోహ్లీ ‘టాప్’ గల్లంతు... సఫారీలపై చెత్త ప్రదర్శనే కారణం!


టీమిండియా టెస్టు జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ టీ20ల్లో టాప్ ర్యాంకును కోల్పోయాడు. ఫ్రీడమ్ సిరీస్ లో భాగంగా టీమిండియా చెత్త ప్రదర్శనతో టైటిల్ ను చేజార్చుకుంది. డ్యాషింగ్ బ్యాట్స్ మన్ గా జట్టుకు వెన్నెముకగా నిలుస్తాడనుకున్న కోహ్లీ, ధర్మశాలలో జరిగిన తొలి మ్యాచ్ లో మెరుగ్గానే రాణించినా, కటక్ లో జరిగిన రెండో టీ20లో సింగిల్ పరుగుకే వెనుదిరిగాడు. ఈ చెత్త ప్రదర్శన కారణంగానే చాలా కాలం నుంచి టీ20 బ్యాటింగ్ ర్యాంకుల్లో అగ్రస్థానంలో ఉన్న కోహ్లీ దానిని చేజార్చుకోవాల్సి వచ్చింది. ఓ మెట్టు కిందకు జారిన కోహ్లీ ప్రస్తుతం రెండో ర్యాంకులో కొనసాగుతున్నాడు. ఇక ఆసీస్ టీ20 జట్టు కెప్టెన్ ఆరోన్ ఫించ్ అగ్రస్థానానికి ఎగబాకాడు. ఇదిలా ఉంటే, చెత్త ప్రదర్శనతో టైటిల్ ను సఫారీ జట్టుకు అప్పనంగా అప్పజెప్పిన టీమిండియా కూడా నాలుగో స్థానం నుంచి ఏకంగా ఆరో ర్యాంకుకు పడిపోయింది. సఫారీ జట్టు ఓ స్థానం మెరుగుపరచుకుని ఐదో ర్యాంకుకు చేరింది. శ్రీలంక టాప్ పొజిషన్ లో కొనసాగుతోంది.

  • Loading...

More Telugu News