: విశాఖలో అక్రమ కట్టడాల కూల్చివేత... వ్యతిరేకత తెలిపిన బాధిత కుటుంబాలు
ఆంధ్రప్రదేశ్ లోని విశాఖపట్నంలో ప్రభుత్వ స్థలంలో నిర్మించిన నిర్మాణాలను ఖాళీ చేయించేందుకు వెళ్లిన అధికారులకు స్థానికుల నుంచి తీవ్ర వ్యతిరేకత ఎదురైంది. విశాఖలోని భరత్ నగర్ పరిధిలో ఉన్న మురికివాడలో నిర్మాణాలను కూల్చివేయాలని కోర్టు ఇటీవల ఆదేశాలు జారీ చేసింది. కోర్టు ఆదేశాలతో అక్కడికి వెళ్లిన జీవీఎంసీ అధికారులు 14 అక్రమ కట్టడాలను కూల్చివేసేందుకు సిద్ధమవగా బాధిత కుటుంబాలు ఘర్షణకు దిగాయి. అక్కడే ఉన్న పోలీసులు వారిని అడ్డుకోవడంతో ప్రస్తుతం కట్టడాల కూల్చివేత కొనసాగుతోంది. దాంతో 14 కుటుంబాలు రోడ్డున పడ్డాయి. గతంలో తమకు అనుకూలంగా కోర్టు తీర్పు ఇచ్చిందని, అయినా ఎందుకు కూల్చివేస్తున్నారని బాధితులు తీవ్రంగా మండిపడుతున్నారు.