: విజయవాడలో ఏపీ కేబినెట్ సమావేశం ప్రారంభం


ఏపీ కేబినెట్ సమావేశం కాసేపటి క్రితం విజయవాడలో ప్రారంభమయింది. ఈ భేటీలో పలు కీలక నిర్ణయాలు తీసుకోనున్నారు. ఆంధ్రప్రదేశ్ సాంస్కృతిక రాజధానిగా పేరుగాంచిన రాజమండ్రి పేరును రాజమహేంద్రవరంగా మార్చే అంశంపై ప్రస్తుతం చర్చ జరుగుతోంది. అనంతరం, అగ్రిగోల్డ్ ఆస్తుల వేలం, కేశవరెడ్డి పాఠశాలల నిర్వహణ అంశాలపై చర్చిస్తారు. దీనికితోడు, రాజధాని శంకుస్థాపన అంశంపై ప్రధానంగా చర్చించనున్నారు. దేశ, విదేశాలకు చెందిన ప్రముఖులు అమరావతికి విచ్చేయనుండటంతో, ప్రభుత్వం శంకుస్థాపన కార్యక్రమాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంది.

  • Loading...

More Telugu News