: శ్రీకాకుళం జిల్లాలో ఎలుగుబంట్లు దాడి... ఇద్దరికి తీవ్ర గాయాలు


శ్రీకాకుళం జిల్లాలో ఎలుగుబంట్ల దాడులు కొనసాగుతున్నాయి. జిల్లాలోని వజ్రపుకొత్తూరు మండలం కొండపల్లి గ్రామంలో ఈ ఉదయం స్థానికులైన మడ్డు రామకృష్ణ(50), అంబటి పాపారావు(45) లు జీడి తోటలో కూలి పనికి వెళుతున్నారు. ఆ సమయంలో మూడు ఎలుగుబంట్లు వారిపై అనూహ్యంగా దాడి చేశాయి. ఈ ఘటనలో ఇద్దరికీ తీవ్రగాయాలయ్యాయి. ముందు స్థానిక ఆసుపత్రికి వారిని తీసుకెళ్లారు. మెరుగైన చికిత్స కోసం అక్కడి నుంచి విశాఖలోని కేజీహెచ్ ఆసుపత్రికి తరలించారు. ఒక్క ఈ నెలలోనే ఎలుగుబంట్లు దాడి చేయడం మూడవసారి అని, అధికారులకు ఎన్నిసార్లు చెప్పినా చర్యలు తీసుకోవడంలేదని స్థానికులు చెబుతున్నారు.

  • Loading...

More Telugu News