: కేంద్రానికి అవార్డు తిరిగిచ్చేస్తున్న మరో రచయిత


దేశ మొదటి ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ మేనకోడలు, రచయిత నయనతార సెహ్ గల్, రచయిత అశోక్ వాజ్ పేయిల జాబితాలో మరో రచయిత చేరారు. ఉత్తరప్రదేశ్ లోని దాద్రీలో బీఫ్ తీన్నాడన్న అనుమానంతో ఓ ముస్లింను కొట్టి చంపిన ఘటనకు నిరసనగా ప్రముఖ ఉర్దూ రచయిత రహ్మాన్ అబ్బాస్ తనకు కేంద్రం ఇచ్చిన అవార్డును వెనక్కు ఇస్తున్నట్టు ప్రకటించారు. దాద్రీ ఘటన తరువాత ఉర్దూ రచయితలంతా తీవ్ర అసంతృప్తితో ఉన్నారన్నారు. తమకు జరుగుతున్న అన్యాయంపై పోరాడాల్సిన సమయం వచ్చిందని చెప్పారు. తనతో పాటు మరికొందరు ఉర్దూ రచయితలు కూడా ఈ నిరసనలో పాలుపంచుకోవాలని అనుకుంటున్నారని అబ్బాస్ వెల్లడించారు.

  • Loading...

More Telugu News