: రాజమండ్రి...ఇకపై రాజమహేంద్రవరం: కేబినెట్ భేటీలో నిర్ణయం తీసుకోనున్న చంద్రబాబు
తూర్పుగోదావరి జిల్లాలోని ప్రధాన నగరం రాజమండ్రిని పూర్వ కాలంలో రాజమహేంద్రవరం అని పిలిచేవారు. అయితే కాలక్రమేణా రాజమహేంద్రవరం పేరు కాస్తా రాజమండ్రిగా మారిపోయింది. ఇప్పుడు మనమంతా ఆ నగరాన్ని రాజమండ్రిగానే పిలుస్తున్నాం. అయితే రాష్ట్ర విభజన తర్వాత ఏపీ సీఎంగా బాధ్యతలు చేపట్టిన టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు తెలుగు సంస్కృతి, సంప్రదాయాలను కాపాడాలని నిర్ణయించారు. ఇందులో భాగంగా ఏపీలో జీవం పోసుకున్న కూచిపూడి నాట్యానికి పునరుజ్జీవం పోసేందుకు ఆయన భారీ ప్రణాళిక ప్రకటించారు. నవ్యాంధ్ర రాజధాని పేరును ‘అమరావతి’గా నిర్ణయించారు. ఈ క్రమంలో రాజమండ్రి పేరును కూడా రాజమహేంద్రవరంగా మార్చాలని ఇటీవల చంద్రబాబు నిర్ణయించారు. ఈ మేరకు మరికాసేపట్లో జగరనున్న కేబినెట్ సమావేశాల్లో భాగంగా దీనిపై అధికారిక ప్రకటన వెలువడనుంది. ఇక రాజధాని శంకుస్థాపన, అగ్రిగోల్డ్ ఆస్తుల వేలం, కేశవరెడ్డి విద్యాసంస్థల వ్యవహారంపైనా కేబినెట్ భేటీలో సుదీర్ఘ చర్చ జరగనున్నట్లు సమాచారం.