: నటుడిగా మారిన బ్రెట్ లీ...‘ఆన్ ఇండియా’లో లిప్ లాక్ సీన్స్ లోనూ నటించిన ఫాస్ట్ బౌలర్
ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్, ఆ దేశ సూపర్ ఫాస్ట్ బౌలర్ బ్రెట్ లీ నటుడిగా మారిపోయాడు. ఇండియన్ నేటివిటీతో తెరకెక్కిన చిత్రం ‘ఆన్ ఇండియన్’లో అతడు లీడ్ రోల్ పోషించాడు. చిత్రంలో అధ్యాపకుడిగా కనిపించనున్న అతడి సరసన భారత నటి తనిష్ఠా ఛటర్జీ నటించారు. సినిమాలో వీరిద్దరి మధ్య ఉన్న లిక్ లాక్ సీన్లు ప్రేక్షకులను అలరించనున్నాయి. వచ్చే గురువారం ఆస్ట్రేలియా వ్యాప్తంగా విడుదల కానున్న ఈ చిత్రం ప్రీమియర్ షో నిన్న సిడ్నీలో జరిగింది. ఉన్నత విద్యాభ్యాసం కోసం ఆస్ట్రేలియా వెళ్లిన భారత విద్యార్థులకు అక్కడి భాషను నేర్పడంతో పాటు ఆస్ట్రేలియా సంస్కృతిపై అవగాహన కల్పించే అధ్యాపకుడి పాత్రలో బ్రెట్ లీ నటన అద్భుతంగా ఉందని నిన్నటి ప్రీమియర్ చూసిన విశ్లేషకులు చెబుతున్నారు. ఈ చిత్రాన్ని ‘ఆస్ట్రేలియా ఇండియా ఫిలిం ఫండ్’ నిర్మించింది. రూ.29 కోట్లతో నిర్మితమైన ఈ చిత్రానికి అనుపమ్ శర్మ దర్శకత్వం వహించారు. ఇక ఈ చిత్రం భారత్ లో రిలీజ్ కు సంబంధించిన వివరాలు వెల్లడి కాలేదు.