: ఇక ‘బతుకమ్మ’ వరి... తెలంగాణ వాతావరణానికి అనుకూలమట!


తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమం నేపథ్యంలో ఆ ప్రాంత సంప్రదాయ పండుగ ‘బతుకమ్మ’ విశ్వవ్యాప్తమైంది. ఇక తెలంగాణ వాతావరణ పరిస్థితులకు తట్టుకుని అధిక దిగుబడులను ఇచ్చే ‘బతుకమ్మ వరి’ వంగడం కూడా త్వరలోనే విశేష గుర్తింపును సొంతం చేసుకోనుంది. తెలంగాణ సాగు పరిస్థితులకు అనుకూలమైన 14 మేలురకం వంగడాలను రూపొందించిన తెలంగాణ స్టేట్ సీడ్ సబ్ కమిటీ వాటిని ఈ నెల 13న విడుదల చేయనుంది. ఈ 14 రకాల్లో వరి వంగడాల విభాగంలో అభివృద్ధి చేసిన ‘జేజీఎల్ 18047’ రకానికి సబ్ కమిటీ సభ్యులు ‘బతుకమ్మ వరి’గా పేరు పెట్టారు. ఇక మిగిలిన వరి వంగడాల విషయానికొస్తే... కేఎన్ఎం118 (కునారం సన్నాలు), ఎంటీయూ 1010, డబ్ల్యూజీఈజే 347 (సోమనాథ్), ఆర్ఎన్ఆర్ 15048 (తెలంగాణ సోనా), ఎంటీయూ 10110 ఉన్నాయి. ఇక కంది, పెసరలోనూ పలురకాల మేలురకం వంగడాలను అభివృద్ధి చేశారు.

  • Loading...

More Telugu News