: పోలీస్ ఎస్కార్ట్ తో రోడ్డెక్కిన బస్సులు... హాలియాలో టవరెక్కిన ‘బంద్’


రైతు సమస్యలపై తమ వైఖరికి నిరసనగా విపక్షాలు చేపట్టిన బంద్ ను ఎలాగైనా తిప్పికొట్టాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించుకుంది. బంద్ కోసమంటూ విపక్ష నేతలు తెల్లవారకముందే రోడ్డెక్కగా, వారిని నిలువరించేందుకు ప్రభుత్వం కూడా పోలీసులను తెల్లవారుజామునే రంగంలోకి దింపింది. రోడ్లపై కనిపించిన విపక్ష నేతలను పోలీస్ స్టేషన్లకు చేర్చింది. ఇక బంద్ కు చెక్ చెబుతూ కొద్దిసేపటి క్రితం పోలీస్ ఎస్కార్ట్ తో ఆర్టీసీ బస్సులను ప్రభుత్వం రోడ్డెక్కించింది. హైదరాబాదుతో పాటు రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో పోలీస్ భద్రత మధ్య ఆర్టీసీ బస్సులు రోడ్డెక్కాయి. ఇదిలా ఉంటే, ప్రభుత్వ నిర్బంధకాండను నిరసిస్తూ కాంగ్రెస్ పార్టికి చెందిన ఓ కార్యకర్త నల్లగొండ జిల్లా హాలియాలో సెట్ టవర్ ఎక్కాడు. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితి నెలకొంది.

  • Loading...

More Telugu News