: ఢిల్లీలో కంపించిన భూమి... భయంతో పరుగులు పెట్టిన ప్రజలు
ఈ ఏడాది భూకంపాల ప్రభావం కాస్తంత ఎక్కువగానే ఉన్నట్టుంది. ఉత్తర భారతంలోని పలు ప్రాంతాలతో పాటు ఏపీలోని పలు జిల్లాల్లో చాలాసార్లు భూమి కంపించిన ఘటనలు నమోదయ్యాయి. తాజాగా దేశ రాజధాని ఢిల్లీని కూడా స్వల్ప భూ ప్రకంపనలు వణికించాయి. గత అర్ధరాత్రి 1.40 గంటల సమయంలో ఢిల్లీలోని పలు ప్రాంతాల్లో భూమి కంపించింది. రిక్టర్ స్టేలుపై 3 తీవ్రతగా నమోదైన ఈ భూకంపం కారణంగా నగరంలోని పలు ప్రాంతాల్లో భూమి కంపించింది. ఉన్నట్టుండి భూమి కంపించడంతో ఆయా ప్రాంతాల ప్రజలు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. ఇళ్లల్లో నుంచి బయటకు పరుగులు తీశారు. రాత్రంతా రోడ్లపైనే జాగారం చేశారు. ఈ భూకంపం కారణంగా ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం జరగలేదు.