: వివాదంలో 'ఆగ్నెస్ ఆఫ్ గాడ్' స్టేజ్ షో


ప్రముఖ స్టేజ్ షో 'ఆగ్నెస్ ఆఫ్ గాడ్' వివాదంలో పడింది. ఈ షోను ఇప్పటికే ముంబై, కేరళలలో నిషేధించారు. 1980లలో అమెరికా రచయిత రాసిన 'ఆగ్నెస్ ఆఫ్ గాడ్' నవల ఆధారంగా అదే పేరుతో ఈ స్టేజ్ షోను ప్రదర్శిస్తున్నారు. పలు దేశాల్లో ఈ స్టేజ్ షోపై నిషేధం ఉంది. ముంబయ్ లోని లామకాన్ బిల్డింగ్ లో ఈ స్టేజ్ షోను ప్రదర్శించేందుకు నిర్వాహకులు ఏర్పాట్లు చేశారు. దీంతో పలు క్రైస్తవ సంఘాలకు చెందిన వ్యక్తులు లామకాన్ బిల్డింగ్ కు చేరుకుని నిరసన వ్యక్తం చేస్తున్నారు. దీంతో, పోలీసులు అక్కడకు చేరుకుని, వారిని అడ్డుకున్నారు. దీంతో అక్కడ ఉద్రిక్తత నెలకొంది. ఈ నవలలో క్రైస్తవ సన్యాసిని అనుకోని పరిస్థితుల్లో గర్భందాల్చుతుంది. చేసిన తప్పుకు శిక్షగా ఆమె మృతశిశువుకు జన్మనిస్తుంది. ఆమె తప్పుకు శిక్షగా సన్యాసినిగా ఉండడానికి తగదని ఆమెను నిషేధిస్తారు. సైన్స్ కు, భక్తికి మధ్య సంఘర్షణగా ఈ నవలను రచయిత రచించారు. అయితే స్టేజ్ షోను క్రైస్తవాన్ని విమర్శించేందుకు వినియోగిస్తున్నారు. ఈ కారణంగానే పలుదేశాల్లో ఈ స్టేజ్ షో నిషేధం ఎదుర్కొంటోంది.

  • Loading...

More Telugu News