: రెండు గంటల్లో డెలివరీ చేస్తాం: పేటీఎం


ప్రముఖ ఈకామర్స్ సంస్థ పేటీఎం ఆర్డర్ చేసిన వస్తువులను కేవలం రెండు గంటల్లో వినియోగదారులకు అందజేస్తామని ప్రకటించింది. ఫాస్టెస్ట్ ఎక్స్ పర్ట్ డెలివరీ పేరుతో ప్రారంభించనున్న ఈ సర్వీసుకు 100 కోట్ల రూపాయలు వెచ్చించనున్నట్టు పేటీఎం అసోసియేట్ వైస్ ప్రెసిడెంట్ అమిత్ బగారియా తెలిపారు. ఈ సర్వీసును మొబైల్ స్టోర్స్ తో అనుసంధానంగా వినియోగదారులకు అందించనున్నట్టు ఆయన చెప్పారు. ఈ సర్వీసు ద్వారా వినియోగదారులు ఆర్డర్ చేసిన మొబైల్ డివైజ్ ను రెండు గంటల్లో వారికి చేర్చడమే కాకుండా నిపుణులు వినియోగదారులకు ఆ డివైజ్ వివరాలను స్వయంగా వివరిస్తారని తెలిపారు.

  • Loading...

More Telugu News