: ఇరాక్ లో ఐఎస్ దారుణం... గ్రామస్థుల కిడ్నాప్
ఐఎస్ఐఎస్ ఉగ్రవాదులు మరో దారుణ చర్యకు పాల్పడ్డారు. ఇరాక్ లోని కిర్కుక్ జిల్లా అల్ హలావత్ గ్రామంలోని దాదాపు 200 మందిని ఐఎస్ ఉగ్రవాదులు నిన్న కిడ్నాప్ చేశారు. మీడియా కథనం మేరకు, కిడ్నాప్ కు గురైన గ్రామస్తుల వివరాలు తెలియరాలేదు. భద్రతాదళాలకు సమాచారమందిస్తూ, వారికి సాయపడుతున్నారన్న కారణంగానే వారిని కిడ్నాప్ చేసినట్లు స్థానిక పోలీసులు అధికారులు చెప్పారు. ఇరాక్, సిరియా దేశాలలో ఐఎస్ ఉగ్రవాదుల దారుణాలకు పాల్పడటం కొత్తేమీ కాదు. గతంలో ఇక్కడి ప్రజలను కిడ్నాప్ చేసి వారిని ఐఎస్ఐఎస్ పొట్టనబెట్టుకోవడం తెలిసిందే.