: ఆవుల స్మగ్లింగ్ తగ్గటం వల్లే అక్కడ మాంసం ధరలు పెరిగాయి: రాజ్ నాథ్ సింగ్


భారత్-బంగ్లా సరిహద్దుల్లో బీఎస్ఎఫ్ దళాలు నిఘాను పెంచాయని, దీంతో ఆవుల స్మగ్లింగ్ బాగా తగ్గిందని కేంద్ర హోం మంత్రి రాజ్ నాథ్ సింగ్ అన్నారు. రాజ్ నాథ్ సొంత నియోజకవర్గమైన లక్నోలో ఆయన మాట్లాడుతూ, గతంలో ఏడాదికి 13 లక్షల ఆవులను బంగ్లాదేశ్ కు అక్రమంగా తరలించేవారని, ఇప్పుడు ఆ సంఖ్య 2-3 లక్షలకు తగ్గిందని ఆయన వివరించారు. దీంతో బంగ్లాదేశ్ లో గోమాంసం ధరలు బాగా పెరిగాయని అన్నారు. ఈ విషయాన్ని భారత్ లో బంగ్లాదేశ్ హైకమిషనరే స్వయంగా తనకు చెప్పారని రాజ్ నాథ్ అన్నారు.

  • Loading...

More Telugu News