: తిరుమల రెండో ఘాట్ రోడ్ లో తగలబడ్డ టెంపో
తిరుమల తిరుపతి దేవస్థానంలో శ్రీవారిని దర్శించుకునేందుకు తిరుచురాపల్లికి చెందిన తమిళ భక్తులు 25 మంది టెంపోలో బయల్దేరారు. మరి, కాసేపట్లో శ్రీవారిని దర్శించుకునేందుకు చేరుకుంటారనగా, రెండో ఘాట్ రోడ్డులో టెంపోలో మంటలు చెలరేగాయి. వాటిని గమనించిన ప్రయాణికులు డ్రైవర్ ను అప్రమత్తం చేయడంతో పెను ప్రమాదం తప్పింది. అలాగే, వారంతా వేగంగా దిగేయడంతో ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదు. కాగా, షార్ట్ సర్క్యూట్ కారణంగా రేడియేటర్ లో చెలరేగిన మంటలు వేగంగా వ్యాపించాయని డ్రైవర్ తెలిపారు. అగ్నిమాపక సిబ్బంది వచ్చి మంటలు ఆర్పారు. అప్పటికే టెంపో పూర్తిగా కాలిపోయింది. ఈ ఘటనలో ప్రయాణికుల సామాన్లు తగలబడిపోయాయి. జరిగిన ఘటనతో భక్తులు ఆందోళనకు గురయ్యారు.