: లక్ష్మణరేఖ దాటిన చైనా కుటుంబానికి రూ.70 లక్షల జరిమానా!


చైనాలో ఒకే బిడ్డను కనాలనే విధానం చాలాకాలంగా అమల్లో ఉంది. ఈ విధానాన్ని ఉల్లంఘించి, ఏడుగురు పిల్లలకు జన్మనిచ్చింది ఒక జంట. అందుకుగాను ఆ కుటుంబంపై చైనా ప్రభుత్వం భారీ మొత్తంలో 1,10,180 డాలర్లు జరిమానా విధించింది. మన కరెన్సీలో చెప్పాలంటే సుమారు రూ. 71.35 లక్షలు. బీజింగ్ లోని టాంగ్ ఝౌ జిల్లాకు చెందిన దంపతులకు ముగ్గురు కొడుకులు, నలుగురు కూతుళ్లు. అయితే, జనాభా నమోదు సందర్భంగా నివాస అనుమతిగా యిచ్చే ‘హుకావ్’ ఆ కుటుంబానికి లేదు. దీంతో స్థానిక జనాభా, కుటుంబనియంత్రణ కమిషన్ 7 లక్షల యువాన్ల జరిమానా విధించింది. కుటుంబనియంత్రణ విధానం అమలును చైనా ప్రభుత్వం ఇటీవల సరళతరం చేసింది. అయితే, నిబంధనలు ఇలా ఉల్లంఘించిన వారిపై మాత్రం జరిమానాలు తప్పట్లేదు.

  • Loading...

More Telugu News