: కన్నడ సినీనటి ఇంటిని సీజ్ చేసిన పోలీసులు
గుజరాత్ లో అరెస్టైన కన్నడ సినీ నటి మారియా సుసైరాజ్ కు చెందిన మహారాష్ట్రలో గల ఇంటిని గుజరాత్ పోలీసులు సీజ్ చేశారు. సుసైరాజ్ కు చెందిన ట్రావెల్ ఏజెన్సీ ద్వారా హజ్ యాత్రకు బుక్ చేసుకున్న విమాన టికెట్లను రద్దు చేయడం ద్వారా ఆమె 2.60 కోట్ల రూపాయల భారీ కుంభకోణానికి ఆమె పాల్పడ్డారని ఆరోపిస్తూ, వడోదర పోలీసులు ఆమెను నిన్న గుజరాత్ లో అరెస్టు చేశారు. ఈ కేసులో మరింత విచారణ జరుపుతున్న పోలీసులు మహారాష్ట్రలోని థానేలో ఆమె నివసించిన ఇంటిని సీజ్ చేశారు. కాగా, సుసైరాజ్ గతంలో జైలు జీవితం అనుభవించింది.