: దేశంలో సైబర్ పోర్నోగ్రఫీని నియంత్రించలేం: సీబీఐ


ఆ మధ్య దేశంలో పోర్నోగ్రఫీ సైట్లను నిషేధించేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమవగా తీవ్ర నిరసనలు వెల్లువెత్తడంతో ఆ ప్రయత్నాన్ని విరమించుకుంది. అంటే దేశంలో పోర్నోగ్రఫీకున్న డిమాండ్ ఎలాంటిదో తెలుస్తోంది. ఈ క్రమంలో దేశంలో హింసాత్మకమైన సైబర్ పోర్నోగ్రఫీని నియంత్రించడం కష్టమని సర్వోన్నత న్యాయస్థానానికి సీబీఐ స్పష్టం చేసింది. దేశంలో లైంగిక అసంతుష్ట పురుషుల నుంచి భారీ స్థాయిలో డిమాండ్ ఉన్నందున అది కష్టమని తెలిపింది. కామోద్రేక పూరితమైన, మహిళలపై హింసాపూరితమైన విషయాలనే వారు తరచూ చూస్తుంటారని కోర్టుకు వివరించింది. పోర్నోగ్రఫీకి డిమాండ్ ఉండటంతో ఒక వెబ్ సైట్ ను ఆపి వేసినా నెట్ కంటెంట్ ప్రొవైడర్స్ వెంటనే మరో వెబ్ సైట్ ను ముందుకు తీసుకొస్తున్నారని తెలిపింది. భారత్ సైబర్ మార్కెట్ గణనీయమైన శక్తిగా ఉండటంతో దానిపై సీమాంతర విద్రోహుల నుంచి తరచుగా సైబర్ దాడులు జరుగుతున్నాయని వెల్లడించింది. ఈ నేపథ్యంలో సైబర్ లైంగిక నేరాలు, నేరగాళ్లపై దర్యాప్తు జరిపే విధంగా సీబీఐను దేశవ్యాప్తంగా ఏకైక విచారణ సంస్థగా ఏర్పాటు చేయాలని కోరుతూ సుప్రీంకోర్టులో అఫిడవిట్ దాఖలు చేసింది. ఈ సమయంలోనే పోర్నోగ్రఫీపై సీబీఐ తన స్పందన తెలిపింది.

  • Loading...

More Telugu News