: అమరావతి శంకుస్థాపన షెడ్యూల్ విడుదల


నవ్యాంధ్ర రాజధాని శంకుస్థాపనకు సంబంధించిన షెడ్యూల్ ను రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది. ఈ కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోదీ ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. ఈ క్రమంలో ఆయన పర్యటనకు సంబంధించిన షెడ్యూల్ ను అధికారులు రూపొందించారు. ప్రభుత్వ షెడ్యూల్ ప్రకారం, ఈ నెల 22న ఉదయం 11.20కి మోదీ గన్నవరం ఎయిర్ పోర్టుకు చేరుకుంటారు. అటునుంచి మధ్యాహ్నం 12.20కి ఉద్ధండరాయుని పాలెంకు చేరుకుంటారు. 12.35కి రాజధానికి శంకుస్థాపన చేస్తారు. 12.45కి మా తెలుగు తల్లి గీతాలపన కార్యక్రమంలో పాల్గొంటారు. 1.10కి భూములిచ్చిన రైతులను సన్మానించనున్నారు. తరువాత ఈ-బ్రిక్ పోర్టల్ ను ప్రధాని ఆవిష్కరిస్తారు. ఈ సందర్భంగా పోర్టల్ ద్వారా విరాళలను స్వీకరించనున్నారు. ఆ తరువాత 1.17కి సీఎం చంద్రబాబు ప్రసంగిస్తారు. ఈ కార్యక్రమం తరువాత 2.40కి విందులో పాల్గొంటారు. చివరికి మోదీ తిరుపతికి బయలుదేరి వెళ్లి అక్కడి వేద పాఠశాలను ప్రారంభిస్తారు. అక్కడి నుంచే ఢిల్లీకి తిరుగు ప్రయాణమవుతారని షెడ్యూల్ లో పేర్కొన్నారు. ఈ షెడ్యూల్ పై పీఎంవో, ప్రధాని భద్రతా విభాగం ఎస్పీజీ తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉంది.

  • Loading...

More Telugu News