: బాలీవుడ్ ప్రముఖ సంగీత దర్శకుడు రవీంద్ర జైన్ కన్నుమూత


బాలీవుడ్ ప్రముఖ సంగీత దర్శకుడు రవీంద్ర జైన్(71) కన్నుమూశారు. కొంతకాలంగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ముంబైలోని లాలీవతీ ఆసుపత్రిలో సాయంకాలం నాలుగు గంటల సమయంలో తుదిశ్వాస విడిచారు. 1970 నుంచి బాలీవుడ్ లో కెరీర్ ప్రారంభించిన జైన్ పలు చిత్రాలకు సంగీతం అందించారు. ముఖ్యంగా రాజ్ కపూర్ చిత్రాల ద్వారా ఆయనకు మంచి బ్రేక్ వచ్చింది. 1980, 90ల్లో పలు పౌరాణిక చిత్రాలకు, టీవీ సీరియళ్లకు జైన్ సంగీత దర్శకత్వం వహించారు.

  • Loading...

More Telugu News