: మాజీ మంత్రి కుమారుడికి రెండేళ్ల జైలు శిక్ష, 20 లక్షల జరిమానా


మాజీ మంత్రి పినిపే విశ్వరూప్ కుమారుడు కృష్ణారెడ్డికి రెండేళ్ల జైలు శిక్ష పడింది. చెల్లని చెక్కు ఇచ్చిన కేసులో హైదరాబాదులోని ఎర్రమంజిల్ న్యాయస్థానం ఆయనకు ఈ శిక్షతో పాటు 20 లక్షల రూపాయల భారీ జరిమానా విధించింది. తన వద్ద తీసుకున్న అప్పును చెల్లించేందుకు చెల్లని చెక్ ఇచ్చారని కృష్ణారెడ్డిపై విజయలక్ష్మి అనే మహిళ ఎర్రమంజిల్ కోర్టును ఆశ్రయించారు. ఈ కేసును విచారించిన న్యాయస్థానం కృష్ణారెడ్డి తప్పుచేశారని నిర్ధారిస్తూ రెండేళ్ల జైలు శిక్షతోపాటు 20 లక్షల భారీ జరిమానా విధించింది.

  • Loading...

More Telugu News