: 'శివాయ్' చిత్రంలో బ్రిటిష్ బాలనటి
బాలీవుడ్ చిత్రం ‘శివాయ్’లో బ్రిటిష్ బాలనటి ఆబిగైల్ ఈమ్స్ నటించనుంది. హీరో అజయ్ దేవగణ్ తన సొంత బ్యానర్ లో, స్వీయ దర్శకత్వంలో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. ఈ చిత్రంలో తన కూతురి పాత్రను ఆబిగైల్ పోషిస్తోందని అజయ్ తన ట్విట్టర్ లో పేర్కొన్నారు. ఆబిగైల్ ఫొటోను కూడా పోస్ట్ చేశాడు. బాలనటిని ఎంపిక చేసేందుకుగాను మనదేశంతో పాటు కెనడా, యూఎస్, యూకే దేశాలలో పర్యటించామన్నారు. ఎట్టకేలకు బ్రిటన్ కు చెందిన ఆబిగైల్ ను ఎంపిక చేసినట్లు ట్విట్టర్ లో వివరించారు. కాగా, వచ్చే ఏడాది దీపావళి నాటికి 'శివాయ్' చిత్రం విడుదల కానుంది.