: ప్రధానితో సమావేశానికి రావట్లేదు: నేతాజీ కుమార్తె అనితాబోస్


ప్రధాని నరేంద్ర మోదీతో జరగనున్న సమావేశానికి తాను హాజరు కావట్లేదంటూ నేతాజీ సుభాష్ చంద్ర బోస్ కుమార్తె అనితా బోస్ తెలిపారు. నేతాజీ కుటుంబసభ్యులు సుమారు 35 మందితో ఆ రోజున ప్రధాని సమావేశం కానున్నారు. నేతాజీ కుటుంబసభ్యులతో ప్రధాని మోదీ సమావేశం ఈ నెల 14న జరగనుంది. ఈ సమావేశానికి అనితా బోస్ తో పాటు ఆమె కుమారుడు సుగతో బోస్, అదే కుటుంబానికి చెందిన మాజీ ఎంపీ కృష్ణ బోస్ కూడా హాజరుకావట్లేదు. ఈ విషయాన్ని అనితాబోస్ సన్నిహితులు కోల్ కతాలో చెప్పారు. అనితాబోస్ ప్రస్తుతం లండన్ లో ఉన్నారని, ఈ నెల 15వ తేదీ తర్వాతే ఆమె భారత్ కు వస్తారని అన్నారు. నేతాజీకి సంబంధించిన ఫైళ్లు కొన్ని ఇతర రాష్ట్ర ప్రభుత్వాల వద్ద, కేంద్ర ప్రభుత్వం వద్ద ఉన్నాయని, వాటిని కూడా బయటపెట్టాలని ప్రధానిని కోరనున్నట్లు వారి కుటుంబసభ్యుల్లో ఒకరైన చంద్ర బోస్ పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News