: తెలంగాణలో ప్రతిపక్షాల నిరసనలపై మంత్రి తలసాని విమర్శలు


తెలంగాణ రాష్ట్రంలో రైతు ఆత్మహత్యలు, సమస్యలపై గత కొన్ని రోజుల నుంచి నిరసనలు చేస్తున్న ప్రతిపక్షాలపై మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ విమర్శలు చేశారు. ఇన్నాళ్లు రైతుల గురించి పట్టించుకోని వీరంతా ఇప్పుడు కొత్తగా రోడ్లెక్కి నిరసనలు చేయడమేంటన్నారు. ఒక్క తెలంగాణలోనే రైతుల ఆత్మహత్యలు జరుగుతున్నాయా? అని ప్రశ్నించారు. ఈ మేరకు సచివాలయంలో తలసాని మీడియాతో మాట్లాడారు. అరవై సంవత్సరాలు అధికారంలో ఉన్న పార్టీలు రైతులకు చేసిందేమి లేదని, ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వంపై నిందలు మోపడం సరికాదని సూచించారు. రైతులకు చెప్పినట్టుగానే రూ.17వేల కోట్ల రుణమాపీ చేస్తామని, ఇప్పటికే రెండు దశల్లో రూ.8,500 కోట్లు చెల్లించామని చెప్పారు. మిగతావి కూడా సెటిల్ చేసేందుకు ప్రయత్నిస్తున్నామన్నారు. ప్రతిపక్షాలకు పనీపాట లేకనే ఇలా రోజూ ఏదో ఒకటి కావాలని చేస్తున్నారని ఆరోపించారు. ఇలా పగలు తిడుతూ, సాయంత్రానికి కాళ్లు పట్టుకుని పనులు చేసిపెట్టమంటారని తలసాని ఎద్దేవా చేశారు.

  • Loading...

More Telugu News