: జగన్ మళ్లీ జైలుకెళ్లడం ఖాయం: ఉపముఖ్యమంత్రి కేఈ
వైఎస్ఆర్సీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి మూడు నెలల్లో జైలుకెళ్లడం ఖాయమని ఏపీ ఉపముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి అన్నారు. ఈరోజు ఆయన విలేకరులతో మాట్లాడారు. కేసుల నుంచి బయటపడేందుకే జగన్ దీక్షలు చేస్తున్నారని విమర్శించారు. పట్టిసీమ ద్వారా రాయలసీమకు నీళ్లిస్తామంటే వైఎస్ఆర్సీపీ నేతలు అడ్డుకుంటున్నారని ఆరోపించారు. రాయలసీమను సస్యశ్యామలం కానీయకుండా ఆ నేతలు అడ్డుపడుతుండటాన్ని ఆయన తప్పుబట్టారు. నదులు అనుసంధానం చేసిన ఘనత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబుకే దక్కుతుందని కేఈ కృష్ణమూర్తి అన్నారు.