: అది ఆవు మాంసం కాదు: నిర్ధారణ


ఉత్తరప్రదేశ్ లోని దాద్రి గ్రామంలో గోమాంసం తిన్నాడని ఆరోపిస్తూ మహ్మద్ అఖ్లాఖ్ (50) ను హత్య చేసిన సంగతి తెలిసిందే. ఘటన జరిగిన సమయంలోనే అతను, అతని కుటుంబ సభ్యులు అది గోమాంసం కాదని దాడి చేసిన వారి కాళ్లా వేళ్లాపడ్డారు. అయినప్పటికీ అఖ్లాఖ్ ను హత్య చేశారు. ఘటన జరిగిన ప్రదేశం నుంచి మాంసాన్ని సేకరించిన పోలీసులు, ఫోరెన్సిక్ ల్యాబ్ కు పంపారు. దానిని మేక మాంసంగా ఫోరెన్సిక్ నిపుణులు నిర్ధారించారు. ఈ నివేదికను ఫోరెన్సిక్ నిపుణులు నేడు విచారణాధికారులకు అందజేశారు. కాగా, ఘటన జరిగిన అనంతరం మృతుని కుమార్తె మీడియాతో మాట్లాడుతూ, అది గోమాంసం కాకపోతే తన తండ్రిని తెచ్చి ఇస్తారా? అని ప్రశ్నించింది. మరి నిందితులు ఇప్పుడేమంటారో చూడాలి!

  • Loading...

More Telugu News