: చేతులు కలిపిన రాందేవ్ బాబా - ఫ్యూచర్ గ్రూప్


ప్రముఖ యోగా గురు బాబా రాందేవ్ కు చెందిన పతంజలి సంస్థ ప్రముఖ రీటైల్ వ్యాపార సంస్థ ఫ్యూచర్ గ్రూప్ (బిగ్ బజార్) తో ఒప్పందం కుదుర్చుకుంది. ఒప్పందం ప్రకారం, 240 నగరాల్లో ఉన్న రిటైల్ ఔట్ లెట్లలో పతంజలి ఉత్పత్తులను విక్రయించనున్నామని ఫ్యూచర్ గ్రూప్ ప్రతినిధులు తెలిపారు. రానున్న 20 నెలల కాలంలో రూ. 1000 కోట్ల వ్యాపారాన్ని జరుపుతామని చెప్పారు. ఈ సందర్భంగా, బాబా రాందేవ్ మాట్లాడుతూ, ఫ్యూచర్ గ్రూప్ లాంటి గొప్ప సంస్థతో ఒప్పందం కుదుర్చుకోవడం వల్ల పతంజలి గౌరవం రెట్టింపయిందని అన్నారు. 2015-16 ఆర్థిక సంవత్సరం పూర్తయ్యేసరికి పతంజలి ఫుడ్స్ టర్నోవర్ రూ. 5 వేల కోట్లకు చేరుకుంటుందని తెలిపారు.

  • Loading...

More Telugu News