: డెంగ్యూతో ఆసుపత్రిపాలైన వన్డే క్రికెట్ కెప్టెన్


బంగ్లాదేశ్ వన్డే క్రికెట్ కెప్టెన్ మష్రాఫె మోర్తజా ఆసుపత్రి పాలయ్యాడు. డెంగ్యూ జ్వరంతో అతను బాధపడుతున్నాడు. ఢాకాలోని అపోలో ఆసుపత్రిలో అతను చికిత్సపొందుతున్నాడు. మోర్తజాకు జ్వరం ఎక్కువగా ఉందని అతని స్నేహితుడు తెలిపాడు. డెంగ్యూ కారణంతో, మోర్తజా బంగ్లా నేషనల్ లీగ్ కు దూరమయ్యాడు. మోర్తజా ఆరోగ్యంపై బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు ఫిజీషియన్ స్పందించారు. తాను డాక్టర్లతో మాట్లాడానని, మోర్తజాకు డెంగ్యూ ఉందని డాక్టర్లు నిర్ధారించారని తెలిపాడు. గత కొన్ని రోజులుగా ఏడాది వయసున్న మోర్తజా కుమారుడు తీవ్ర జ్వరంతో బాధపడుతున్నాడని, ఇప్పుడు మోర్తజాకు కూడా తీవ్ర జ్వరం వచ్చిందని చెప్పాడు.

  • Loading...

More Telugu News