: ఇన్నాళ్లు వాళ్లిద్దరూ ఎందుకు కలవలేదు?: ప్రధాని మోదీ


రాష్ట్రాభివృద్ధిని కోరుకుంటున్నామని చెబుతున్న నితీష్ కుమార్, లాలూప్రసాద్ యాదవ్ లు ఇన్నాళ్లు ఎందుకు కలవలేదంటూ ప్రధాని నరేంద్ర మోదీ ప్రశ్నించారు. బీహార్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈరోజు ససారాంలో జరిగిన సభలో ఆయన మాట్లాడారు. కేవలం రాజకీయాల కోసమే వాళ్లిద్దరూ ఒక్కటయ్యారు తప్ప, రాష్ట్రాభివృద్ధి కోసం కాదన్నారు. ‘ఓట్లు వేయమని అడిగేందుకు నితీష్, లాలూలు మీవద్దకు వస్తే ప్రజలకు ఏమి చేశారని నిలదీయండి’ అంటూ బీహార్ ప్రజలకు మోదీ సూచించారు. కాగా, బీహార్ లో తొలివిడత ఎన్నికలు అక్టోబర్ 12న జరగనున్నాయి. ఈ నేపథ్యంలో తొలివిడత ఎన్నికల ప్రచారం ముగియనుండటంతో రాజకీయ పార్టీల ప్రచారం జోరుగా సాగుతోంది.

  • Loading...

More Telugu News