: జగన్ కెమెరామన్ వంశీ అరెస్ట్... భార్యను హత్య చేసినట్లు ఒప్పుకోలు
వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వ్యక్తిగత కెమెరామన్ వంశీ నేరం ఒప్పుకున్నాడు. తల్లిదండ్రులు, సోదరి, బావతో కలిసి భార్య వరలక్ష్మిని హత్య చేసిన వంశీ, ఆ తర్వాత ఆమె శవాన్ని ఓ కాలువ పక్కన పాతిపెట్టాడు. మూడు నెలల క్రితమే ఈ దారుణానికి ఒడిగట్టిన వంశీ, పోలీసులను తప్పుదోవ పట్టించేందుకు తన భార్య అదృశ్యమైందని నాడే కృష్ణా జిల్లా నాగాయలంక పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు కూడా చేశాడు. ఈ క్రమంలో వరలక్ష్మి కనిపించడం లేదని ఆమె తల్లిదండ్రులు హెచ్చార్సీని ఆశ్రయించారు. దీంతో స్పందించిన హెచ్చార్సీ దీనిపై పూర్తి స్థాయిలో విచిరణ చేపట్టాలని కృష్ణా జిల్లా ఎస్పీకి ఆదేశాలు జారీ చేసింది. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు కూపీ లాగగా, వంశీనే తన తల్లిదండ్రులు, సోదరి, బావలతో కలిసి వరలక్ష్మిని హత్య చేసినట్లు తేలింది. విషయం తెలుసుకున్న వంశీ పరారయ్యాడు. అయితే పోలీసులు అతడి తల్లిదండ్రులతో పాటు హత్యలో పాలుపంచుకున్న అతడి సోదరి, బావలను అరెస్ట్ చేశారు. ఈ క్రమంలో వంశీ కూడా అరెస్టయ్యాడు. పోలీసుల విచారణలో భాగంగా వరలక్ష్మిని హత్య చేసినట్లు వంశీ ఒప్పుకున్నట్లు సమాచారం.