: ఇప్పుడు నెట్ వర్కింగ్ పై దృష్టిపెట్టాం: చంద్రబాబు
విశాఖలో ఈ-ప్రగతి ప్రాజెక్టును సీఎం చంద్రబాబు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఇంతకుముందు ఐటీని అభివృద్ధి చేసి, హైదరాబాద్ లో హైటెక్ సిటీని నిర్మించామని చెప్పారు. ఇప్పుడు ఏపీలో నెట్ వర్కింగ్ పై దృష్టిపెట్టామని తెలిపారు. విశాఖలో ఇంతకుమించిన బిల్డింగ్ ను నిర్మించనున్నామన్నారు. ప్రస్తుత కాలంలో పట్టణ ప్రాంతాల నుంచే ప్రభుత్వానికి ఎక్కువ ఆదాయం వస్తోందన్నారు. సంక్షోభాల నుంచే ఎక్కువ అవకాశాలు వస్తాయని తాను నమ్ముతానన్నారు. తాము విజయవాడకు రాగానే అందరూ ఇక్కడికే రావడం మొదలుపెట్టారని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో మంత్రులు పల్లె రఘునాథ్ రెడ్డి, గంటా శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. ఈ-ప్రగతి ప్రాజెక్టు ద్వారా 33 శాఖలు, 315 సంస్థల నుంచి ఈ-సేవలు అందుబాటులోకి రానున్నాయి. ప్రభుత్వ శాఖల సమాచారమంతా ఒకేచోట లభ్యం కానుంది. దాంతో పౌరసేవలు మరింత త్వరగా లభిస్తాయి.