: 27 ఏళ్లు పోరాడి రాజస్థాన్ నుంచి రూ. 2 కోట్ల పరిహారం పొందిన అమెరికన్


భారత న్యాయవ్యవస్థలో విచారణలు సుదీర్ఘకాలం సాగినా చివరకు తీర్పు బాధితుల పక్షమేనని మరోసారి రుజువు చేసిన ఘటన ఇది. దాదాపు 27 సంవత్సరాల పోరాటం తరువాత ఓ అమెరికన్ రాజస్థాన్ రాష్ట్ర రవాణా సంస్థ నుంచి సుమారు రూ. 2 కోట్ల పరిహారాన్ని పొందాడు. మరిన్ని వివరాల్లోకి వెళితే, యూఎస్ వాసి అలెగ్జిక్ సోనియెర్ 1988లో జరిగిన 'పీస్ మార్చ్'లో పాలు పంచుకునేందుకు జైపూర్ వచ్చాడు. ఇతడిని రాజస్థాన్ ఆర్టీసీ బస్సు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో సోనియెర్ కోమాలోకి వెళ్లగా, తదుపరి చికిత్సల నిమిత్తం అమెరికాకు తరలించారు. అప్పటి నుంచి ఆయన తల్లి నష్టపరిహారం కోసం తిరుగుతూనే ఉంది. తొలుత ట్రైబ్యునల్ రూ. 1.25 కోట్లను చెల్లించాలని తీర్పివ్వగా, రాజస్థాన్ ఆర్టీసీ హైకోర్టును ఆశ్రయించింది. హైకోర్టు ఈ మొత్తాన్ని కొంత తగ్గిస్తూ, రూ. కోటిని పరిహారంగా ఇవ్వాలని తీర్పివ్వగా, దాన్ని సైతం ఆర్టీసీ సుప్రీంకోర్టులో సవాల్ చేసింది. ఆపై కేసును విచారించిన ధర్మాసనం, రాజస్థాన్ రాష్ట్ర రవాణా సంస్థ తీరును తప్పు పడుతూ, రూ. 1.25 కోట్లను కేసు దాఖలు చేసిన నాటి నుంచి వడ్డీతో కలిపి తక్షణమే చెల్లించాలని తీర్పిచ్చింది. దీంతో ఆ అమెరికన్ ఇప్పుడు సుమారు రెండు కోట్లు అందుకుంటాడు.

  • Loading...

More Telugu News