: సోమనాథ్ ఆలయానికి బాంబు బెదిరింపు... హై అలర్ట్ ప్రకటన
గుజరాత్ లోని సోమనాథ్ ఆలయంపై ఓ ఉగ్రవాద సంస్థ బాంబుదాడి చేయబోతోందంటూ తెలిసింది. ఈ మేరకు ఆలయ ట్రస్టు కమిటీకి ఓ లేఖ వచ్చింది. ఈ విషయాన్ని వెంటనే పోలీసులకు తెలియజేయడంతో హై అలర్ట్ నోటీస్ జారీ చేశారు. ఆలయం వద్ద భద్రతాబలగాలను మోహరించి కట్టుదిట్టమైన భద్రత చేపట్టారు. పోలీసులు, బాంబు స్క్వాడ్ ఆలయ పరిసర ప్రాంతాలన్నిటినీ పరిశీలించారు. ఇంతవరకు ఎలాంటి పేలుడు పదార్థాలు కనుగొనలేదని పోలీసులు తెలిపారు. ఆలయానికి సందర్శకుల రాకపోకలపై నిఘా ఉంచారు.