: కావాల్సినన్ని నిధులు ఇస్తుంటే, ప్రత్యేక హోదాపై రాద్ధాంతం ఎందుకు?: పురందేశ్వరి


ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని... భారీగా నిధులను ఇస్తోందని బీజేపీ నాయకురాలు పురందేశ్వరి చెప్పారు. కేంద్ర ప్రభుత్వం ఇంత చేస్తున్నా... ప్రత్యేక హోదాపై రాద్ధాంతం ఎందుకు చేస్తున్నారని ఆమె మండిపడ్డారు. పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లులో జరుగుతున్న బీజేపీ కార్యకర్తల శిక్షణా శిబిరానికి ఆమె ఈ రోజు హాజరయ్యారు. ఈ సందర్భంగా కార్యకర్తలను ఉద్దేశించి ఆమె ప్రసంగిస్తూ, ప్రత్యేక హోదాకు బీజేపీ వ్యతిరేకం కాదు అన్నారు. ప్రత్యేక ప్యాకేజీ ఇచ్చినా ఆంధ్రప్రదేశ్ అద్భుతంగా అభివృద్ధి చెందుతుందని తెలిపారు.

  • Loading...

More Telugu News